నిబద్ధతతో పని చేసేవాళ్లం
‘ అప్పుడు నిబద్ధత, నిజాయతీతో పనిచేసేవాళ్లం. ఎవ్వరికై నా ఏ పనైనా చేస్తామని మాట ఇస్తే చేసేవాళ్లం. పట్టణంలో అన్నీ మట్టిరోడ్లే ఉండే. ప్రస్తుతం చాలా మారింది. రాజకీయాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి..’ అని కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పనిచేసిన పట్టణానికి చెందిన వనమాల రాములు, ముబీన్ కౌన్సిలర్, కలికోట రమణయ్య అన్నారు. మొదటి తరంలో కౌన్సిలర్‌గా పనిచేసిన వనమాల రాములును ఇప్పటికీ కౌన్సిలర్ రాములుగానే స్థానికులు పిలుస్తుంటారు. మున్సిపల్ అభివృద్ధి, పాలకవర్గం, ఎన్నికలు తదితర అంశాలపై గురువారం వారు ‘సాక్షి’తో ముచ్చటించారు. – కాగజ్‌నగర్‌టౌన్


