అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి
రెబ్బెన: వేంకటేశ్వర జాతర నేపథ్యంలో పోలీ సు అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో విధు లు నిర్వర్తించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జాతరకు 282 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రెబ్బెన మండలం గంగా పూర్‌లో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక డ్యూటీ సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేయాలని, మహిళలు, పిల్లల భద్రతపై దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, స్పెషల్ బ్రాంచి సీఐ సతీశ్, రెబ్బెన, వాంకిడి సీఐలు సంజయ్, సత్యనారాయణ, ఎస్సైలు వెంకటకృష్ణ, వెంకటేశ్, ఆర్‌ఐ ఆంజన్న పాల్గొన్నారు.


