ఎలా వెళ్లాలంటే..
అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తాండూర్, బెల్లంపల్లి, మంచిర్యాల వైపు నుంచి వచ్చే భక్తుల 2, 3 వీలర్ వాహనాలు రెబ్బెన ఫ్లైఓవర్ మీదుగా పుంజుమేరగూడ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద గల మార్గం నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి ద్వారా సింగల్‌గూడ, గంగాపూర్ గ్రామం మీదుగా చేరుకోవాలి. కారు, బస్సులు వంటి వాహనాలు రెబ్బెన బస్టాండ్ వద్ద యూటర్న్ తీసుకుని గంగాపూర్ రైల్వేగేట్ ద్వారా జాతరకు చేరుకోవాలి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ వైపు నుంచి వచ్చే భక్తుల బైక్‌లు, ఆటోలు పుంజుమేరగూడ వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌బంక్ వద్ద ఉన్న యూటర్న్ వద్ద నుంచి సింగల్‌గూడ, గంగాపూర్ మీదుగా రావాలి. కార్లు, బస్సులు రెబ్బెనలోని గంగాపూర్ రైల్వేగేట్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. జాతర నుంచి బయటకు వచ్చే వాహనాలన్నీ న్యూ ఆర్చీ నుంచి వెంచర్ మార్గం ద్వారా పల్లవి బ్రిడ్జి వైపు నుంచి జాతీయ రహదారికి చేరుకోవాలి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ వైపు వెళ్లే వాహనాలు గోలేటి ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న యూటర్న్ ద్వారా తమ మార్గానికి చేరుకోవాలి. పాత గంగాపూర్ కమాన్ వైపు నుంచి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
జాతర రూట్ మ్యాప్


