మూడు రోజుల జాతరకు ముస్తాబు
రెబ్బెన: ప్రకృతి ఒడిలో కొలువైన బాలాజీ వెంకన్న జాతరకు సమయం ఆసన్నమైంది. రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మూడురోజులపాటు నిర్వహించే వేడుకుల కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం నుంచి సో మవారం వరకు జాతర మహోత్సవం జరగనుంది. మొదటి రోజు స్వామి వారి కల్యాణం, రెండోరోజు రథోత్సవం, మూడో రోజు భక్తులకు దర్శనంతో జా తర ముగియనుంది. ఉమ్మడి జిల్లా భక్తులతోపాటు కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.
భక్తుడి కోసం గుట్టలో కొలువై..
గంగాపూర్ శివారులోని గుట్టపై స్వామి కొలువైన తీరు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలను గ్రామస్తులు ఈ విధంగా చె బుతుంటారు. 16వ శతాబ్దానికి పూర్వం గంగాపూర్‌కు చెందిన ముమ్మడి పోతాజీ చిన్నతనం నుంచి కాలినడకన తిరుమల తిరుపతికి వెళ్లి మాఘశుద్ధ పౌర్ణమి రోజు వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించేవాడు. తిరిగి కాలినడకనే స్వగ్రామానికి వచ్చేవాడు. కాలక్రమేనా వయస్సు పైబడటం, ఆరోగ్యం క్షీణించడంతో ఒక ఏడాది తిరుపతి వరకు వెళ్లలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో స్వామి వారు పోతాజీ కలలో కనిపించి గ్రామ పొలిమేరలోని గుట్టలో కొలువై ఉన్నానని.. తన కోసం ఆలయం నిర్మించాలని కోరినట్లు చెప్పుకుంటారు. ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినాన నీకోసం, నీలాంటి భక్తుల కోసం దర్శనం ఇస్తానని చెప్పి నిష్క్రమించారు. ఆ తర్వాత గంగాపూర్ వాగులో పుణ్నస్నానం ఆచరించి గుట్టను తొలగవగా.. లోపల స్వామి పట్టెనామాలు దర్శనమిచ్చాయి. అప్పటి నుంచి ప్రతీ మాఘశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారు ఆలయంలో కొన్ని గడియలు కొలువు తీరి ఉంటారని భక్తులు విశ్వసిస్తారు.
శోభాయమానంగా అలంకరణ
ఆలయంతోపాటు పోతాజీ సమాధి, ముఖద్వారాని కి రంగులు వేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, హెల్త్ క్యాంపులు, అంబులెన్సులు ఏర్పాటు చేశారు. రథోత్సవానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, చెన్నూర్, గోదావరిఖని తదితర ప్రాంతాల నుంచి భక్తుల కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది.
అతిపెద్ద జాతర
ఆలయంలో మూడు రోజుల జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. జిల్లాలో జరిగే అతిపెద్ద జాతర ఇది. మంగళవారం నుంచి గురువారం వరకు భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు పూర్తి చేశాం.
– వేణుగోపాల్ గుప్తా, ఆలయ ఈవో
అంగరంగ వైభవంగా..
ఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. స్వామి, ఆమ్మ వార్ల కల్యాణంతో మహోత్సవం ప్రారంభమవుతుంది. రెండోరోజు ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని నిర్వహిస్తాం. మూడోరోజు స్వామి వారి దర్శనం ఉంటుంది.
– కొమ్మెర గణేష్‌శర్మ, ఆలయ అర్చకులు
మూడు రోజుల జాతరకు ముస్తాబు
మూడు రోజుల జాతరకు ముస్తాబు
మూడు రోజుల జాతరకు ముస్తాబు


