‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ
కౌటాల: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి, ఉపాధ్యాయులతో కలిసి చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించా లని, సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫి బ్రవరి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏ ఐజేఏసీటీవో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఎంఈవో హన్మంతు, నరసింహచారి,ఇందురావు, రావుల వినోద్, గుణాకార్, సంపత్, రాజు, మ ణి,సబీనా, రాణి, తిరుమల, దత్త పాల్గొన్నారు.


