నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కాగజ్‌నగర్‌టౌన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. కాగజ్‌నగర్ పట్టణంలో నామినేషన్ల కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల లోపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. భట్టుపల్లి చౌరస్తా, వినయ్ గార్డెన్, ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చెక్‌పోస్టులను పరిశీలించారు. కార్యక్రమంలో బ్రాంచ్ ఎస్సై సతీశ్, సీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి పాల్గొన్నారు.
సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌లు
కాగజ్‌నగర్‌టౌన్: అభ్యర్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తెలిపారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామి నేషన్లు స్వీకరించాలని, అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాలన్నారు. వేచి ఉండేందుకు కుర్చీలను ఏ ర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, అధికారులు రఫీక్, సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు


