ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రకాశ్‌రావుతో కలిసి ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 9,057 ఇళ్లు మంజూరు చేయగా, 7,757 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. మిగిలిన 1,300 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు తెలుసుకున్నామన్నారు. పైలెట్ గ్రామాల్లో ఇళ్లు మంజూరు చేసి ఏడాది పూర్తయిందని, మార్చి 31 వరకు పనులు ప్రారంభించని వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులు వేగవంతం చేసి మార్చిలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందన్నారు. ఆధార్ సక్రమంగా లేకపోవడం, సాంకేతిక సమస్యలు, అటవీ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: కుట్టు మిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. జన్కాపూర్‌లో గల మండల సమైక్య భవనంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ కేంద్రం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 24,765 జతల ఏకరూప దుస్తులు కుట్టి అందించనున్నట్లు తెలిపారు. గడువులోగా యూనిఫాంలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు.


