సభాస్థలి పరిశీలన
కాగజ్‌నగర్‌రూరల్: మున్సిపల్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా శనివారం కాగజ్‌నగర్ ప ట్టణానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రానుండగా, సభాస్థలిని శుక్రవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పరిశీలించారు. మొద ట హనుమాన్ మందిర్ వద్ద సభను నిర్వహించాలని అనుకున్నా.. అనివార్య కారణాలతో మళ్లీ ఎస్పీఎం గ్రౌండ్‌కు మార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్పీఎం గ్రౌండ్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సభకు నా యకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ సంకల్ప సభ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర సీఎం ప్రచారానికి వస్తున్నారని పేర్కొన్నారు.


