జిల్లా కేంద్రంలో ఫ్లాగ్‌మార్చ్
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. 60 మంది పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఓటర్లకు భరోసా కల్పించా రు. ఎస్పీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


