మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
కౌటాల: మహిళల ఆర్థికాభివృద్ధే తమ లక్ష్యమని డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లోని మహిళా సంఘాల సభ్యులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించడానికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల అందిస్తున్నామన్నారు. రుణలక్ష్యాలను ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిరక్షరాస్యులైన మహిళలకు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా చదువు నేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏపీఎంలు వినేశ్, మోహన్‌లాల్, సిబ్బంది పాల్గొన్నారు.


