‘టీబీజీకేఎస్ హయాంలోనే కొత్త హక్కులు’
రెబ్బెన: జాతీయ సంఘాలను కాదని సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్‌కు గుర్తింపు హోదా కల్పిస్తే తమ హయాంలోనే కొత్త హక్కులు సాధించామని ఆ యూనియన్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు అన్నారు. టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో టీబీజీకేఎస్ పతకం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 2003లో ప్రొ.జయశంకర్ చేతుల మీదుగా టీబీజీకేఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తిరిగి తీసుకువచ్చామని అన్నారు. కేసీఆర్ సహకారంతో ఇంక్రిమెంట్, ఉచిత విద్యుత్, కార్మి కుల తల్లిదండ్రులకు ఉచితవైద్యం వంటి అనేక సౌ కర్యాలు అందించామని తెలిపారు. గత రెండేళ్లుగా సింగరేణిలో ఉన్న సంఘాలు యాజమాన్యంతో కు మ్మౖక్కై కార్మికులను ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. సీహెచ్‌పీలో శ్రీనివాస్, వర్క్‌షాప్‌లో మంగీలాల్, సత్యనారాయణ జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, సెంట్రల్ నాయకులు సమ్మయ్య, శ్రీ నివాస్, ఫిట్ కార్యదర్శులు వెంకటేశ్, రమేశ్, శ్రీని వాస్, గణపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


