ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని డిపో నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాలైన కొండగట్టు, వేములవాడకు ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఆసిఫాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ఆర్టీసీ డీఎం రాజశేఖర్‌కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్‌కు రాత్రిపూట మరో బస్సు అదనంగా నడిపించాలని, గతంలో రద్దు చేసిన నిజామాబాద్ బస్సును ప్రారంభించాలని కోరారు. కొండగట్టు, వేములవాడకు వెళ్లే సర్వీసులను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ నుంచి రాత్రి 11 గంటల సమయంలో సూపర్ డీలక్స్ తప్పితే మరొకటి లేదని పేర్కొన్నారు. డీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ధర్మపురి వెంకటేశ్వర్లు, బోనగిరి మురళీధర్, సీహెచ్ రాజు, పత్తి రవి, మహేశ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.


