ఆరోగ్యమే మహాబలం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే మహాబలం

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

● కలెక్టర్‌ కె.హరిత ● వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 2కే రన్‌

ఆసిఫాబాద్‌: ప్రతిఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని, ఆరోగ్యమే మహాబలమని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణ నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులతో 2కే రన్‌ చేపట్టారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఎంహెచ్‌వో సీతారాం, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ సుబోద్‌ కుమార్‌తో కలిసి కలెక్టర్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కుమురం భీం చౌక్‌ మీదుగా బస్టాండ్‌ వరకు ర్యాలీ కొనసాగింది.కలెక్టర్‌ మాట్లాడుతూ ముందు జాగ్రత్తలతో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌ వంటి వ్యాధులను నివారించవచ్చన్నారు. ఈ నెల 6 నుంచి 11 వరకు వైద్యరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement