అప్పులున్నా ప్రజా సంక్షేమాన్ని ఆపలేదు | - | Sakshi
Sakshi News home page

అప్పులున్నా ప్రజా సంక్షేమాన్ని ఆపలేదు

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

మరిన్ని నిధులు తెస్తా.. వర్సిటీ ప్రారంభోత్సవమూ చేస్తా.. జూన్‌ 2లోగా ఎయిర్‌పోర్ట్‌కు భూమిపూజ అయ్యేలా చూస్తా.. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పిప్రి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించి రూ.64 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులున్నా అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మా త్రం ఆపలేదు. జిల్లాలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే ఎయిర్‌పోర్ట్‌ పనులు ప్రారంభిస్తాం. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం సంతోషంగా ఉంది.

– జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి

వేదికపై అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్‌చార్జి మంత్రి జూపల్లి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, విజయరమణారావు, ఎంపీలు గోడం నగేశ్‌, వేంనరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌ జాదవ్‌, ప్రేంసాగర్‌రావు, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్‌ తదితరులు

కైలాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు మళ్లీ వ స్తానని..అభివృద్ధి పనులకు అవసరమైన నిధులిస్తా నని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా నాడు చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బజార్‌హత్నూర్‌ మండలం పిప్రిలో సోమవారం నిర్వహించిన బహిరంగసభకు హాజరయ్యారు. భట్టితో కలిసి వచ్చిన ఆయన రూ. 1,238 కోట్ల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి ప నులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మేరకు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా కు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, మండలస్థాయి నాయకుల వద్దకు వచ్చి వారితో కరచాలనం చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకు సా గుతున్నట్లుగా వెల్లడించారు. ఇంద్రవెల్లిలో పీసీసీ అధ్యక్షుడిగా దళిత గిరిజన,దండోరాతో తాను, పీపు ల్స్‌ పాదయాత్రతో భట్టి చేపట్టిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ముందుకు సాగుతున్నామన్నారు. అపారమైన ఖనిజ సంపదతో పాటు సంస్కృతికి నిలయమైన ఈ ప్రాంతంలో విద్య, వైద్యం అందాల్సిన అవసరముందన్నారు. బోథ్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు మార్చి 2027 వరకు సాధ్యం కాదని ఆ తర్వాత దా న్ని పరిశీలిస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తిరిగి ప్రారంభించి రైతులకు సాగునీటిని అంది స్తామని తెలిపారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం జూన్‌ 2లోగానే శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.ఇండస్ట్రీయల్‌కారిడార్‌ ఏర్పా టుతోపాటు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేసి దాని ప్రారంభోత్సవానికి సైతం తానే హాజరవుతా నని భరోసానిచ్చారు. రెండు నెలలకోసారి జిల్లాకు వస్తూనే ఉంటానని, నిధులు తెస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వవిప్‌లు ఆది శ్రీనివాస్‌, విజ యరమణా రావు, ఎంపీ గోడం నగేశ్‌, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, ప్రేంసాగర్‌రావు, అని ల్‌ జాదవ్‌, వెడ్మ బొజ్జు, మాలోత్‌ రాందాస్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి,మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్‌దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

సభకు హాజరైన జనం

ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యతనివ్వాలి

నా జీవితంలో ఎంతో మంది సీఎంలను చూశాను. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది రేవంత్‌రెడ్డి ఒక్కరే. గోదావరి ఒడ్డున, గుట్టపై ఉన్న గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి రూ.75 కోట్లను కేటాయించాలి. ఆదివాసీలు కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎంత చేసినా తక్కువే. అభివృద్ధి పరంగా మరింత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి పునః ప్రారంభించాలి.

– కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల

ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట

నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క జిల్లా నుంచి చేపట్టిన పాదయాత్రలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దోహదం చేశాయి. అభివృద్ధి, సంక్షేమం కోసం కమిట్‌మెంట్‌తో పని చేసే పార్టీ కాంగ్రెస్‌. రెండేళ్లలోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్‌ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాం. ఉమ్మడి ఆదిలాబాద్‌ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో వందకు పైగా సీట్లను కై వసం చేసుకుంటాం.

– బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్‌

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, రెండు లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలు, మూడు సబ్‌స్టేషన్లు, ఏటీసీ మంజూరు చేసి శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉంది. సీఎం అంటేనే రాష్ట్రానికి తండ్రిలాంటి వారు. మా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి. బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలి. అలాగే రూ.345 కోట్లతో చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు రూ.40 కోట్లు ప్రకటించాలి. జందాపూర్‌–కరంజీ రోడ్డు పనులు పూర్తి చేయాలి. బోథ్‌లో డిగ్రీ కళాశాల, మినీస్టేడియం, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు మంజూరు చేయాలి. సిరిచెల్మ, భరంపూర్‌ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. – అనిల్‌ జాదవ్‌, ఎమ్మెల్యే, బోథ్‌

26 ఏళ్ల తర్వాత సీఎం రావడం సంతోషంగా ఉంది

1983లో ఎన్టీఆర్‌ సీఎం హోదాలో తొలిసారి మా మండలానికి వచ్చారు. మళ్లీ 26 ఏళ్ల తర్వాత రేవంత్‌ రెడ్డి సీఎంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావడం ఆనందంగా ఉంది. బోథ్‌లో మినీ స్టేడియం మంజూరు చేయాలి. రూ.18 కోట్లతో చేపట్టిన భీంపూర్‌– కరంజీ అంతర్రాష్ట్ర రోడ్డ్డును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. నియోజకవర్గానికి మంజూరైన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను పిప్రిలోనే ఏర్పాటు చేయాలి. జిల్లాను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆర్‌అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి.

– గోడం నగేశ్‌, ఎంపీ, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement