కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఫాతిమా కా న్వెంట్ పాఠశాలలో సోమవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నమూనా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం సహకారంతో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలోని 14 పీఎం శ్రీస్కూళ్ల నుంచి 42 మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతి నిధులుగా వ్యవహరించి ప్రసంగించారు. వా తావరణ మార్పులు, మానవులపై పడే ప్రభా వం, ప్రపంచ దేశాలు ఏ విధంగా కృషి చే యాలి.. అనే అంశాలపై చర్చించారు. ఎంఈవో వాసాల ప్రభాకర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయ ని, విద్యార్థులు అంతర్జాతీయ అంశాలపై అ వగాహన కలిగి ఉండాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. జిల్లాస్థాయి నుంచి 11 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చే స్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు లాలాజీ, రాజ, ఇస్లావత్, విజేష్, హదియాబేగం, రేష్మ సుల్తానా పాల్గొన్నారు.


