కాసిపేట: మండలంలోని మల్కేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్, వార్డెన్ దిన్‌దర్షాకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీవో) రమాదేవి మెమో జారీ చేశారు. మండలంలోని మల్కేపల్లి, దేవాపూర్, రేగులగూడ ఆశ్రమ పాఠశాలలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూలో భాగంగా విద్యార్థులకు కోడిగుడ్లు వడ్డించాల్సి ఉండగా వడ్డించలేదన్నారు. రేగులగూడ ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, నెన్నెల మండలం కుశ్నపల్లిలో విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడంతో కుశ్నపల్లి హెచ్‌ఎం లచ్చన్న, ఏఎన్‌ఎంకు మెమో జారీ చేసినట్లు తెలిపారు. హెచ్‌ఎంలు గోపాల్, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.


