విద్యావ్యవస్థ బలోపేతానికే మద్దతు
ఆసిఫాబాద్‌రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సమస్యలపై విద్యార్థులు, నిరుద్యోగులతో ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం డిబేట్ నిర్వహించారు. జిల్లా విద్యా వ్యవస్థలో చాలా వెనుకబడి ఉందని, ఉద్యోగ అవకాశాలు లేక జిల్లా యువత అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు సంయుక్తంగా కృషి చేసి జిల్లాను విద్యారంగంలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. జిల్లాలో సాంకేతిక విద్య కోసం ఇంజినీరింగ్, ఐటీఐ కళాశాలలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. యువత సమస్యలపై స్పందించి, నిరుద్యోగులకు అండగా నిలిచేవారికే ఓటు వేస్తామని పేర్కొంటున్నారు.
గ్రంథాలయంలో పుస్తకాలతో పాటు కనీసం 10 కంప్యూటర్లు ఏర్పాటు చేయాలి. ప్రతీ జాబ్‌లో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంది. చదువుతో పాటు కంప్యూటర్‌పై అవగాహన ఉండాలి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, కన్జ్యూమర్ కోర్టు, సెషన్స్ కోర్డులు లేక ఆదిలాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే కోర్టులు ఏర్పాటు చేయాలి.
– సాయికృష్ణ, ఎల్‌ఎల్‌బీ
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించాలంటే నిరుద్యోగులకు నూతన సాంకేతిక, పరిజ్ఞానం అవసరం. స్కిల్ పెంపొందించుకోవడానికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇవ్వాలి. గ్రూప్, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ అందించాలి.
– శివ, టీటీసీ
ఆదిలాబాద్ కోర్టులకు వెళ్తున్నాం
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అవసరం
విద్యావ్యవస్థ బలోపేతానికే మద్దతు
విద్యావ్యవస్థ బలోపేతానికే మద్దతు
విద్యావ్యవస్థ బలోపేతానికే మద్దతు


