ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి

Feb 11 2026 7:25 AM | Updated on Feb 11 2026 7:25 AM

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి

రెబ్బెన: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ చాంద్‌ పాషా పిలుపునిచ్చారు. ఈ నెల 12న నిర్వహించే సార్వత్రిక సమ్మె పోస్టర్లను మంగళవా రం మండలంలోని గోలేటిలో ఆవిష్కరించారు. ఆ యన మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే రద్దు చేసిన 44 చట్టాలను యాథావిధిగా అమలు చేయాలని డి మాండ్‌ చేశారు. కార్మికులకు కట్టుబానిసలుగా త యారు చేయడానికే కేంద్రం నూతన లేబర్‌ కోడ్‌ల ను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తిరుపతి, ఏరియా అధ్యక్షుడు పోశం, ప్రధాన కా ర్యదర్శి శ్రీనివాస్‌, కార్మికులు శారద, మల్లేశ్వరీ, సునీత, కుమార్‌, భీమేశ్‌, ప్రభాకర్‌, రాజు, జగదీష్‌, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement