వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించాలి
రెబ్బెన: ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను గడువులోగా అధిగమించాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) తిరుమల్‌రా వు అన్నారు. ఖైరిగూర ఓసీపీని సోమవారం ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఓసీపీలో ఏర్పాటు చేసిన ఇన్‌ఫిట్ క్రషర్ కన్వేయర్ బెల్ట్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇన్‌ఫిట్ క్రషర్ కన్వేయర్ బెల్ట్‌తో బొగ్గు రవాణా వేగవంతం అవుతుందన్నారు. వాహనాల వినియోగం, చమురు వాడకం తగ్గనుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ఏరియాను అగ్రభాగాన నిలపడంపై అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి తిరుపతి, పీవో మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమ ల్లు, గోలేటి ఓసీపీ పీవో ఉమాకాంత్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


