వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యమని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం రెండోరోజూ ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో అమలు చేయాలని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్‌వో షేకు, ఏటీడీవో చిరంజీవి, రిసోర్స్‌పర్సన్లు కృష్ణ, నారాయణమూర్తి, రాజేంద్ర ప్రసాద్, గణపతి తదితరలు పాల్గొన్నారు.


