మినీ ఇండియా.. ‘కాగజ్‌నగర్’
కొత్తపేట గ్రామం నుంచి మున్సిపాలిటీగా..
పారిశ్రామిక ప్రాంతంగా గణనీయమైన అభివృద్ధి
ఉపాధి, ఉద్యోగ నిమిత్తం వలస వచ్చిన కార్మికులు
భిన్న సంస్కృతులకు నిలయంగా పట్టణం
కాగజ్‌నగర్ పట్టణం
కాగజ్‌నగర్‌టౌన్: పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి ప్రత్యేక చరిత్ర ఉంది. 1932లో నిజాం కాలంలో సర్‌సిల్క్ పరిశ్రమ, సిర్పూర్ పేపర్ మిల్లును స్థాపించారు. అప్పటివరకు కొత్తపేట గ్రామంగా ఉండగా ఆ తర్వాత నోటిఫైడ్ ఏరియాగా మారింది. పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి, ఉద్యోగం నిమిత్తం కార్మికులు వలసవచ్చి స్థిరపడ్డారు. బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, నేపాల్ తదితర ప్రాంతాల చెందిన వారు ఇక్కడ నివాసం ఉండటంతో పట్టణాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. భిన్న సంస్కృతుల ప్రజలు కలిసిమెలిసి ఆచారాలకు అనుగుణంగా పండుగలు జరుపుకొంటారు. దసరా నవరాత్రుల్లో దుర్గామాత, వినాయక నవరాత్రుల్లో వినాయక చవితి, ఛట్‌పూజలు, బతుకమ్మ, తదితర పండగలు ఘనంగా నిర్వహిస్తారు.
1958లో మున్సిపాలిటీ ఏర్పాటు
భారీ పరిశ్రమలైన సర్‌సిల్క్ నుంచి నూలు వస్త్రం, ఎస్పీఎం నుంచి కాగితం దేశవిదేశాలకు ఎగుమతి చేసిన ఘన చరిత్ర పట్టణానికి ఉంది. బిర్లా యాజమాన్యం అతిథుల కోసం సర్‌సిల్క్ ఏరియాల్లో అప్పట్లోనే ప్రత్యేకంగా ఎయిరోడ్రమ్‌ను ఏర్పా టు చేసింది. పట్టణంలో అధిక భాగం సర్‌సిల్క్ క్వార్టర్లు, మరోవైపు ఎస్పీఎం క్వార్టర్లతో ఉన్న కొత్తపేట అభివృద్ధి చెందింది. కాగితం పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడంతో కాగజ్‌నగర్(హిందీలో కా గజ్ అంటే కాగితం, నగర్ అంటే పట్టణం)గా నామకరణం చేశారు. 1958లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పట్లో పట్టణ జనాభాకు అనుగుణంగా మట్టి రోడ్లు, ఓ ప్రధాన రోడ్డు ఉండేది. కాలక్రమేణా జనాభాకు అనుగుణంగా పట్టణాభివృద్ధి జరిగింది.
70వేలకు పైగా జనాభా
కాగజ్‌నగర్ పట్టణంలో 1967లో 20 వార్డులు ఉండేవి. ప్రధానంగా కాలనీల్లో మురుగుకాలువలు, మట్టి రోడ్లు ఉండేవి. ఆ తర్వాత 20 నుంచి 30 వార్డులకు విస్తరించారు. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం సుమారు 70 వేలకు పైగా జనాభా ఉంది. 2020 ఎన్నికల్లో 44,946 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 51,205 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,004, మహిళలు 26,193 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు.
1967లో తొలి ఎన్నికలు
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ 1967లో ఎన్నికలు జరగగా జనరల్ అభ్యర్థి మోటీచంద్ చౌర్దియా మొదటిసారి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1972– 81 వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. 1981–86లో జూపాక నర్సయ్య, నక్కబాపు చైర్మన్లుగా పనిచేశా రు. 1987లో మూడోసారి జరిగిన ఎన్నికల్లో బుచ్చి లింగం విజయం సాధించారు. మళ్లీ 1995లో నర్స య్య రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2000లో సులేమాన్ బిన్ సయిద్ ఎన్నిక కాగా, చివ రి తొమ్మిది నెలలు దస్తగిరి పదవిలో కొనసాగారు. 2010 నుంచి 2014 వరకు మళ్లీ ప్రత్యేకా ధికారి పాలన కొనసాగింది. 2014లో సీపీ విద్యావతి, 2020లో సద్దాంహుస్సేన్ చైర్మన్లుగా కొనసాగారు.


