గల్లీ నుంచి అసెంబ్లీకి | - | Sakshi
Sakshi News home page

గల్లీ నుంచి అసెంబ్లీకి

Feb 1 2026 3:13 AM | Updated on Feb 1 2026 3:13 AM

గల్లీ

గల్లీ నుంచి అసెంబ్లీకి

● అంచెలంచెలుగా ఎదిగి.. ● ఎమ్మెల్యేలుగా ఎన్నికై న కౌన్సిలర్లు, చైర్మన్లు

వారంతా ఒకప్పుడు గల్లీ నుంచి ఎన్నికై న వారే.. కౌన్సిలర్లు, చైర్మన్లుగా పట్టణవాసులకు సేవలందించి శాసనసభలోనూ అడుగు పెట్టారు. అంచెలంచెలుగా అసెంబ్లీ స్థాయికి ఎదిగి తమదైన మార్కు చూపారు. ఉమ్మడి జిల్లాకు

చెందిన పలువురిపై ప్రత్యేక కథనం.

– కై లాస్‌నగర్‌/మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌)

అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షిద్‌

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి నిర్వహించిన రెండో ఎన్నికల్లో మసూద్‌ హైమద్‌ ఖుర్షిద్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1965 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మున్సిపల్‌ పరిధిలో అందించిన సేవలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఈ క్రమంలో 1972లో కాంగ్రెస్‌ నుంచి ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయన ను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

గల్లీ నుంచి అసెంబ్లీకి1
1/1

గల్లీ నుంచి అసెంబ్లీకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement