నామినేషన్లకు నేడే ఆఖరు
స్వతంత్రులు
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. రెండోరోజు గురువారం ఆసిఫాబాద్‌లో 45, కాగజ్‌నగర్‌లో 49 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య 104కు చేరింది. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్‌ఎస్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీకి ఉత్సాహం చూపారు. కాగజ్‌నగర్‌లో గురువారం బీజేపీ నుంచి 9, కాంగ్రెస్ 13, బీఆర్‌ఎస్ 19, బీఎస్పీ 4, జనసేన 1, ఐయూఎంఎల్ 1, ఇండిపెండెంట్ 2 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కేంద్రాన్ని నోడల్ అధికారి అశ్వక్ అహ్మద్‌తో కలిసి రాష్ట్ర సాధారణ పరిశీలకుడు కుమార్ పరిశీలించారు. శుక్రవారం చివరిరోజు కావడంతో సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన వారిని లోపలికి అనుమతించాలని అధికారులకు సూచించారు. పొరపాట్లకు తావివ్వకుండా నిబంధనల మేరకు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
నామినేషన్ల స్వీకరణకు 15 కౌంటర్లు
కాగజ్‌నగర్ పరిధిలో నామినేషన్ల స్వీకరణకు 15 కౌంటర్లు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ కె.హరిత తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని గురువారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణంలోని డీఏవీ లక్ష్మిపథ్ సింఘానియా పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ తిరుపతి, తహసీల్దార్ మధుకర్, సిబ్బంది ఉన్నారు.
మొత్తం నామినేషన్లు
మున్సిపాలిటీ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ బీఎస్పీ ఇతర పార్టీలు/ మొత్తం
ఆసిఫాబాద్ 17 14 11 1 7 50
కాగజ్‌నగర్ 15 19 12 4 4 54


