‘సమగ్ర సవరణ’ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘సమగ్ర సవరణ’ పకడ్బందీగా నిర్వహించాలి

Feb 1 2026 3:13 AM | Updated on Feb 1 2026 3:13 AM

‘సమగ్ర సవరణ’ పకడ్బందీగా నిర్వహించాలి

‘సమగ్ర సవరణ’ పకడ్బందీగా నిర్వహించాలి

● రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, ఈఆర్‌ఓలు, సబ్‌కలెక్టర్‌లు, ఆర్డీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటా తిరుగు తూ వివరాలు సేకరించాలన్నారు. ఓటరు జాబితా లో ఓటర్ల మ్యాపింగ్‌ పకడ్బందీగా చేపట్టాలన్నారు. కలెక్టర్‌, ఎన్నికల అధికారి కె.హరిత మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో 678 మంది బూత్‌స్థాయి అధికారులు, 68 మంది సూపర్‌వైజర్లు వివరాలు సేకరిస్తున్నారన్నారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్‌ పాల్గొన్నారు.

దేశానికి సేవలందించాలి

ఆసిఫాబాద్‌: దేశపౌరులు దేశానికి తమవంతు సేవలు అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ అధికారులు, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతనెల 24 నుంచి 31 వరకు మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ అధికారులు వాంకిడి మండలం బంబార, రెబ్బెన మండలం గోలేటి, సిర్పూర్‌(టి), కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో పర్యటించి వివిధ విషయాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేశారు.

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు

ఆసిఫాబాద్‌: గంజాయి సాగు చేసినా అక్రమ రవా ణాకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె.హరిత అన్నారు.. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రా వు, కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదొద్దీన్‌తో కలిసి మాదకద్రవ్యాల వినియోగం, నివారణ, గంజాయి అక్రమసాగు, రవాణాపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలన్నారు. అటవీ, పోలీస్‌ శాఖల అధికారులు నిఘా మరింత పటిష్టం చేయాలన్నా రు. అనంతరం నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పోస్ట ర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి అడెపు భాస్కర్‌, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జ్యోతి కిరణ్‌, డీఎంహెచ్‌వో సీతారాం, డీఏవో వెంకటి పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలి

ఆసిఫాబాద్‌: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కలెక్టరేట్‌సమావేశ మందిరంలో పరిశ్రమలు, గనులు, భూగ ర్భ నీటి వనరులు, బ్యాంక్‌, విద్యుత్‌, గిరిజన సంక్షే మ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువత, ఔ త్సాహికులకు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అ వకాశాలు కల్పించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారికి రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ ఎం అశోక్‌ పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి రహదారి భద్రతపై సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement