కేంద్ర బలగాల్లో పల్లె కుర్రోళ్లు | - | Sakshi
Sakshi News home page

కేంద్ర బలగాల్లో పల్లె కుర్రోళ్లు

Feb 7 2026 10:10 AM | Updated on Feb 7 2026 10:10 AM

కేంద్ర బలగాల్లో పల్లె కుర్రోళ్లు

కేంద్ర బలగాల్లో పల్లె కుర్రోళ్లు

పెంచికల్‌పేట్‌: కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు సాధించిన పెంచికల్‌పేట్‌ మండలంలోని పలు గ్రామా లకు చెందిన ఐదుగురు యువకులను శుక్రవారం ఎస్సై అనిల్‌కుమార్‌ స్థానిక పోలీస్టేషన్‌లో శాలు వాతో ఘనంగా సన్మానించారు. పోతపల్లి గ్రామాని కి చెందిన ఎల్కరి రాజశేఖర్‌ సీఐఎస్‌ఎఫ్‌, ఎల్లూర్‌ గ్రామానికి చెందిన దుర్గం కిరణ్‌ సీఆర్‌పీఎఫ్‌, దుర్గం చిరంజీవి సీఐఎస్‌ఎఫ్‌, రౌతు సంతోష్‌ సీఐఎస్‌ఎఫ్‌, పుల్గం ప్రవీణ్‌ సీఐఎస్‌ఎఫ్‌గా ఉద్యోగాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్సై మాట్లాడుతూ యువత వీరిని ఆదర్శంగా తీసుకొని పోలీసు ఉద్యోగ సాధనకు పాటుపడాలన్నారు. ప్రభుత్వ కొలువులు సాధించడానికి శ్రమించాలని సూచించారు. సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement