పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి

Feb 9 2026 7:30 AM | Updated on Feb 9 2026 7:30 AM

పోస్టల్‌ బ్యాలెట్‌  వినియోగించుకోవాలి

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి

కాగజ్‌నగర్‌రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీకులు అలోక్‌కుమార్‌ అన్నా రు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్‌ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలె ట్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డులకు, కాగజ్‌నగర్‌ పట్టణంలోని 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించాల ని ఆయన అధికారులకు సూచించారు. ప్ర శాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సమన్వయంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ తిరుపతి, ఎన్నికల అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement