‘ప్రజల కోసం పోరాడే సీపీఎంను గెలిపించండి’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజల కోసం పోరాడే సీపీఎంను గెలిపించండి’

Feb 9 2026 7:30 AM | Updated on Feb 9 2026 7:30 AM

‘ప్రజల కోసం పోరాడే   సీపీఎంను గెలిపించండి’

‘ప్రజల కోసం పోరాడే సీపీఎంను గెలిపించండి’

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఎం పార్టీ అభ్యర్థులను ము న్సిపల్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించా లని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలోని అనేక కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేవన్నారు. డ్రెయినేజీలు, రహదారులు సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో కాలనీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో సీసీఎం పార్టీ బరిలోకి దిగిందని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజన్న, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్‌, ఆనంద్‌, కార్తీక్‌, టీకానంద్‌, మాలశ్రీ, రాజేందర్‌, 10వ వార్డు అభ్యర్థి భారత్‌జాడే, నాయకులు కృష్ణమాచారి, నిఖిల్‌, తిరుపతి, నైతం రాజు, నితిన్‌, రవిదాస్‌, రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement