ఆటల్లో గెలుపోటములు సహజం
ఆదిలాబాద్: ఆటల్లో గెలుపోటములు సహజమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్, ఆర్చరీ ఫైనల్ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడినవారు కృంగిపోకుండా క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొని, విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతీ క్రీడాకారుడు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించే దిశగా పాటుపడడమే కాకుండా సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు.


