‘బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం’
కాగజ్‌నగర్‌టౌన్: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని ఎస్పీఎం సమీపంలో గల ప్రజాకార్యాలయం, ఓల్డ్‌కాలనీ, బాలాజీనగర్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల సభలకు హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఉన్నారని, మున్సిపల్ ఛైర్మన్‌గా కూడా బీజేపీ అభ్యర్థినే గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల పాలనలో మున్సిపాలిటీని పట్టించుకోకుండా కబ్జాలు, మట్కా, మాఫియా, ఇసుక దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదిస్తే మరిన్ని నిధులు మంజూరు చేయించుకుందామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, ఆయా వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.


