జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
రెబ్బెన: తమిళనాడులోని ఈరోడ్ ఎక్సెల్ కాలేజ్‌లో బుధవారం నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే 70వ జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా బాల్‌బ్యాడ్మిటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ఆటతీరు ప్రదర్శించి జిల్లా జట్టును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపారన్నారు. వీరిలో షార్ప్‌స్టార్ బాల్‌బ్మాడ్మింటన్ అసోసియేషన్ నుంచి బాలుర విభాగంలో పిరిసింగులు సాయిచరణ్, సీహెచ్ గోపాలకృష్ణ, దామెర ప్రేందీప్, బాలికల నుంచి పూదరి శ్రావ్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, కోశాధికారి శంకర్, సెపక్‌తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, మహేందర్‌రెడ్డి, భాస్కర్ అభినందించారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక


