తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలి | - | Sakshi
Sakshi News home page

తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలి

Mar 9 2026 7:33 AM | Updated on Mar 9 2026 7:33 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్‌ చెత్త వాహనంలో వేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్‌ 2, 12 వార్డుల్లో పరిశుభ్రతపై ఆదివారం అవగాహన కల్పించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. అనంతరం వార్డు కౌన్సిలర్‌ దుర్గమ్మ ఆధ్వర్యంలో కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ సిబ్బందిని శాలు వాలతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సి లర్‌ బాబురావు, రెవెన్యూ అధికారి రాజేందర్‌, సిబ్బంది రఫీక్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌, పర్యావరణ ఇంజినీర్‌ ప్రణిల్‌, వార్డు అధికారి ఉష, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement