కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘50 సంవత్సరాల భారతదేశ అత్యవసర పరిస్థితి– భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల వారు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ప్రతీఒక్కరికి 3 నిమిషాల సమయం ఇస్తామన్నారు. భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని లింక్ ద్వారా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విజేతలకు స్టేట్ లెవల్ పోటీలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తూడురు దత్తాత్రేయ, కోఆర్డినేటర్ దుర్గం జనార్దన్, అసిస్టెంట్ ప్రొ.శారద, అధ్యాపకులు పాల్గొన్నారు.


