ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Mar 15 2026 1:22 AM | Updated on Mar 15 2026 1:22 AM

వాంకిడి: ఆస్పత్రి ఆవరణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో సీతారాం సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆ స్పత్రిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళి క కార్యక్రమంలో పాల్గొని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఆస్పత్రికి వచ్చేవారికి ఆహ్లాదక ర వాతావరణాన్ని అందించాలని పేర్కొన్నారు. వై ద్యసిబ్బంది విధులను నిర్లక్ష్యం చేయకుండా సమయపాలన పాటించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ మెరుగైన సేవలు అందించా లని సూచించారు. అంతకుముందు ఆస్పత్రిలోని వ్యాక్సిన్‌ రూమ్‌, మందుల నిల్వ గది, వార్డులు, ప రిసరాలు పరిశీలించారు. ఇన్‌ పేషెంట్‌, అవుట్‌ పే షెంట్‌ రికార్డులు, సిబ్బంది రిజిష్టర్లు తనిఖీ చేశారు. ఆయన వెంట మండల వైద్యాధికారి వినయ్‌ ఉప్రే, ఆరోగ్య విస్తరణాధికారి రవిదాస్‌, ఎంఎల్‌హెచ్‌పీ రియాజ్‌, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement