ఆసిఫాబాద్‌రూరల్: క్రమశిక్షణతో చదివితే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని డీఈవో లలిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన పదో తరగతి వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో సెల్‌ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ చిత్తరంజన్ విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, సీఐ బాలాజీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


