కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని కాలనీల్లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాక కాల్చొద్దని మున్సిపల్ కమిషనర్ తిరుపతి అన్నారు. కోసిని సమీపంలోని మున్సి పల్ డంపింగ్ యార్డును బుధవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్‌తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డులో చెత్తను ఎక్కడపడితే అక్కడ కాకుండా ఒక పక్కనుంచి వేయాలని, చెత్తకు నిప్పు అంట కుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


