లక్సెట్టిపేట: అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు మద్యంమత్తులో దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. లక్సెట్టిపేటలోని మోదెల నెహ్రుకు చెందిన మంచాల కవితను ఆమె భర్త మంచాల సుధాకర్ అదననపు కట్నం కోసం వేధిస్తున్నాడని తెలిపారు. 2009లో కవితకు సుధాకర్‌తో వివాహం జరుగగా, కూతురు(10) ఉందని, పెళ్లయిన ఏడాది నుంచే సుధాకర్ మద్యానికి బానిసై ఆమెను అనేక సార్లు కొట్టాడని తెలిపారు. ఈ విషయమై పలువురు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారని తెలిపారు. సుధాకర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గురువారం బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


