● ఇద్దరికి తీవ్రగాయాలు
బోథ్: మండలంలోని ఘన్‌పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనుగుట్ట గ్రామ సమీపంలో సొనాల గ్రామం నుంచి క్రాస్ రోడ్డు వైపు వెళ్తున్న బైక్‌ను వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులు అనిల్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితులిద్దరూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. విధుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.


