పనిలో భద్రత ప్రమాణాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పనిలో భద్రత ప్రమాణాలు పాటించాలి

Mar 6 2026 8:14 AM | Updated on Mar 6 2026 8:14 AM

చెన్నూర్‌: ప్రతీ ఉద్యోగి తన పనిలో, నిత్య జీవితంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని ఎస్టీపీపీ జీఎం ఎం.నర్సింహారావు తెలిపారు. జైపూర్‌ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు(ఎస్టీపీపీ)లో గురువారం 55వ భద్రతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జీఎం నర్సింహారావు సేఫ్టీ ప్లాగ్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగి భద్రతగా ఉంటే అతడిపై ఆధారపడిన కుటుంబం భద్రంగా ఉంటుందని తెలిపారు. జాతీయ భద్రత దినోత్సవాలు ఎస్టీపీపీలో 13ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం(పీసీఎస్‌), వోఅండ్‌ఎం చీఫ్‌ మదన్‌మోహన్‌, పీఎంపీఎల్‌ హెడ్‌ అఖిల్‌కపూర్‌, ఏజీఎంలు శ్రీనివాస్‌, ఏఐటీయూసీ అసిస్టెంట్‌ ఫిట్‌ సెక్రెట రీ పర్శయ్య, సీఎంవోఏఐ ప్రెసిడెంట్‌ పంతులా, డీ జీఎం అజాజుల్లాఖాన్‌, శ్రీధర్‌, శివప్రసాద్‌, వేణుగో పాల్‌, జనగామ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement