ఉపాధిహామీ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ కూలీ మృతి

Mar 6 2026 8:14 AM | Updated on Mar 6 2026 8:14 AM

కౌటాల: మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన నికోడే దివాంజీ(55) అనే ఉపాధిహామీ కూలీ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దివాంజీ వారం రోజులుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. గురువారం ఉదయం పని ప్రదేశంలో బీపీ పెరిగి సొమ్మసిల్లి కిందపడ్డాడు. తోటి కూలీలు గమనించి కౌటాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు పరీక్షించి దివాంజీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య ఎంకుబాయి, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement