ఆసిఫాబాద్: సీ్త్రలు లేనిదే సృష్టి లేదని, సీ్త్రలను గౌరవించే సమాజంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవా రం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకు ల మంగ, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి వని తలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతీ మహిళ జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న వారేనని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ దేశానికి సేవలందించిన మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తు న్న పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
అంర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిని నృత్య నిలయం మంచిర్యాల విద్యార్థినులు చేసిన సంప్రదాయ నృత్యం, సన్నీ సెల్స్ డిఫెన్స్ అకాడమీ చిన్నపిల్లలు చేసిన కరాటే వి న్యాసాలు అందరినీ అకట్టుకున్నాయి. క్యాంపెయి న్‌పై కలెక్టర్, ఎమ్మెల్యే సంతకాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్, జీసీడీవో శకుంతల, జిల్లా సాధికారత సభ్యులు శారద, రాణి, రాజేశ్వర్, మమత, అధికారులు పాల్గొన్నారు.


