మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్‌లోని బీజోన్ ఏరియాలోగల ఆర్‌సీఎం క్లబ్‌లో ఆదివారం ఫస్ట్ ఇంటర్ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే పోటీలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రఘునా థ్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఆటలతో క్రీడాకారుల్లో మనోధైర్యం, శారీరక దారుఢ్యం పెరుగుతుందని తెలిపారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించారు. నిర్వాహకులు జూల శ్రీనివాస్, ఆషాఢం శ్రీనివాస్, కరాటే మాస్టర్ రమేశ్‌రాజా, వివిధ ఏరియాల కరాటే మాస్టర్లు, కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య, అజీజ్ తదితరులున్నారు.


