కాగజ్‌నగర్‌టౌన్: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ శాస్త్రవేత్త భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ఏకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వా డకం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయన్నారు. మార్కెట్‌కు వెళ్లే ప్రతిఒక్కరూ గుడ్డ సంచులు తీసుకెళ్లాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో వి ద్యార్థుల పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు దేవేందర్‌రెడ్డి, నర్సింగరావు, మల్లికార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు.


