కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Mar 14 2026 7:30 AM | Updated on Mar 14 2026 7:30 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎ దుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ సీఎస్సీ సంస్థ హెల్త్‌ టెస్టులను రద్దు చేయాలని, హెల్త్‌కార్డులు ఇ వ్వాలని, జీవో 12 సవరించాలని, సహజ మరణానికి పరిహారం రూ.5 లక్షలకు పెంచా లని, వెల్ఫేర్‌ బోర్డు నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చే శారు. అనంతరం కలెక్టర్‌ కె.హరితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సప్త బాలకిషన్‌, ధర్మాయి రవి, కె.కమలా కర్‌, రాంచందర్‌, శంకర్‌, సదయ్య, నరస య్య, మురళి, బాలాజీ, మోయిన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement