సిలిండర్ల కొరత లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

సిలిండర్ల కొరత లేకుండా చూడాలి

Mar 14 2026 7:30 AM | Updated on Mar 14 2026 7:30 AM

● వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఆసిఫాబాద్‌అర్బన్‌: రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్‌రావ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావ్‌, ఇతర అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదన్నారు. జిల్లాస్థాయిలో ఎల్‌పీజీ డీలర్లతో మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి ప్రతీరోజు సమీక్షించాలన్నారు. మంత్రి నాగేశ్వర్‌రావ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగా హన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావ్‌ మాట్లాడుతూ ఎల్‌పీజీ సిలిండర్లపై పత్రికలు, మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై కలెక్టర్లు వెంటనే స్పందించాలన్నారు. కలెక్టర్‌ కె.హరిత మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్లు అవసరానికి సరిపడా ఉన్నాయన్నారు. సిలిండర్లు కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రబీ సీజన్‌లో వరి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు సాగులో ఉన్నాయని, ప్రస్తుతం ప్రాజెక్టుల్లో సాగు, తాగునీటికి సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్‌, నీటిపారుదల శాఖ ఈఈలు గుణవంత్‌రావ్‌, ప్రభాకర్‌, వ్యవసాయ శాఖ అధికారి వెంకటి, పౌరసరఫరాల శాఖ అధికారి వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని, కరీంనగర్‌లో ని మెడికవర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల రక్తదానం చాలా గొప్పదన్నారు. ప్రాణా పాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణాలు నిలబెట్టిన వారవుతారన్నారు. డీఆర్‌డీఏ దత్తారావ్‌, డీఎంహెచ్‌వో సీతారాం, డీపీవో భిక్షపతిగౌడ్‌ పాల్గొన్నా రు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement