రెబ్బెన: గత నెల 14 నుంచి 19 వరకు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన వరల్డ్‌కప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణి దేవల్ల శ్రావణిని శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి సన్మానించారు. శాలువాతో సత్కరించి రూ.5 వేలు బహుమతిగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏరియాకు చెందిన క్రీడాకా రిణి గోలేటిలోనే క్రీడా ఓనమాలు నేర్చుకుని నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాజ మల్లు, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్‌రావు, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, హరిలాల్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మల్లేశ్, చందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


