రెబ్బెన: 108, 102కు కాల్స్ వస్తే తక్షణమే స్పందించాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అన్నా రు. మండల కేంద్రంలోని 108, 102 అత్యవసర అంబులెన్స్‌లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. అంబులెన్స్‌లో మెడికల్ స్టాక్, వైద్యపరికరాల పనితీరును పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్యం కోసం 108కు ఫోన్ చేస్తే సంఘటన స్థలానికి చేరుకుని సకాలంలో బాధితులను ఆస్పత్రులకు చేర్చాలన్నారు. విధుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం అవతలి వ్యక్తుల ప్రాణాలకు ముప్పు తెస్తుందని అన్నారు. వేసవి ఎండల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ఐస్‌ప్యాక్ బాక్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 108 మెడికల్ టెక్నీషియన్ రామన్న, పైలట్ సంతోష్ పాల్గొన్నారు.
108, 102 వాహనాలు తనిఖీ
వాంకిడి: మండలంలోని 108, 102 అత్యవసర అంబులెన్స్‌లను గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ తనిఖీ చేశారు. మందులు, పరికరాలు పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రవీణ్, అమృత్‌రావు, భీంరావు, రమేశ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.


