పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు

Mar 16 2026 7:29 AM | Updated on Mar 16 2026 7:29 AM

రెబ్బెన: బీఆర్‌ఎస్‌ బలోపేతం కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గోలేటి గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పు చ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాశ్‌, వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, గోలేటి సర్పంచ్‌ అజ్మీర బాబురావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement