స్వచ్ఛ పాఠశాలలకు నిధులు | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ పాఠశాలలకు నిధులు

Mar 4 2026 7:51 AM | Updated on Mar 4 2026 7:51 AM

● ఎస్‌హెచ్‌వీఆర్‌ కింద జిల్లాలో ఏడు పాఠశాలలు ఎంపిక ● రూ.లక్ష చొప్పున గ్రాంట్‌ మంజూరు చేయనున్న ప్రభుత్వం

ఆసిఫాబాద్‌రూరల్‌: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాలల్లో పరిశుభ్రత, నీటి వసతి, హరిత వాతావరణం, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడానికి జాతీయస్థాయిలో స్వచ్ఛ ఏవమ్‌ హరిత విద్యాలయ రేటింగ్స్‌(ఎస్‌హెచ్‌వీఆర్‌) ఇస్తోంది. ఎస్‌హెచ్‌వీఆర్‌ కింద ఏటా జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికై న పాఠశాలకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు సైతం ప్రకటిస్తోంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఏడు పాఠశాలలు ఎంపికయ్యాయి.

టాప్‌లో రెబ్బెన కేజీబీవీ..

జిల్లాలో ఎస్‌హెచ్‌వీఆర్‌ కింద చేపట్టిన సర్వేలో 1173 పాఠశాలలు పాల్గొన్నాయి. క్షేత్రస్థాయిలో వీటిని పరిశీలించి రేటింగ్‌ ఇచ్చే బాధ్యతను 37 మంది కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతంలో 1– 8 తరగతుల వరకు ఉన్న మూడు, 9– 12 తరగతులు ఉన్న మూడు, పట్టణ ప్రాంతంలో 9– 12 తరగతలు ఉన్న ఒక పాఠశాలను మూల్యాంకనం చేశారు. ఆనంతరం 4, 5 స్టార్స్‌ రేటింగ్‌ ఇచ్చారు. పాఠశాలల్లో తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్ల శుభ్రత, చేతులు శుభ్రం చేసుకునే చోట సబ్బుల వినియోగం, నిర్వహణ తీరు, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు, సామర్థ్యాల పెంపు తదితర అంశాలను పరిశీలించారు. దీని ఆధారంగా జిల్లాలో ఉత్తమమైన ఏడు పాఠశాలలు ఎంపిక చేశారు. రేటింగ్‌లో 5 స్టార్స్‌తో రెబ్బెన కేజీబీవీ అగ్రభాగాన నిలిచింది. కౌటాల కేజీవీవీ, చిన్నరాస్పల్లి ఉన్నత పాఠశాల, సావర్‌ఖేడ్‌, రాంపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల, నాగవెల్లి ప్రాథమిక పాఠశాల, కాగజ్‌నగర్‌ పట్టణంలోని అరుణోదయ ప్రైవేట్‌ స్కూల్‌ 4 స్టార్స్‌ రేటింగ్‌ పొందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement