‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో కలెక్టర్‌

Mar 4 2026 7:51 AM | Updated on Mar 4 2026 7:51 AM

ఆసిఫాబాద్‌: హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులతో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక సమావేశానికి కలెక్టర్‌ కె.హరిత హాజరయ్యారు. శాఖల వారీగా 10 వివిధ థీమ్‌లతో 99 రోజులపాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ నెల 6 నుంచి జూన్‌ 12 వరకు ఐదు దశల్లో 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. ఏప్రిల్‌ 2న గ్రామస్థాయిలో గ్రామ సభల నిర్వహణ, 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement