వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలో మహిళలతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి
పోలీసు సిబ్బందితో ఎస్పీ నితిక పంత్ వేడుకలు
స్టెప్పులు వేస్తున్న ఎస్పీ నితిక పంత్
ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబురాలు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే చిన్నారులు, యువకులు కేరింతలు కొడుతూ పరస్పరం రంగులు చల్లుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మిని బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ నితిక పంత్ స్టెప్పులు వేస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. ఇన్‌స్పెక్టర్లు బాలాజీ వరప్రసాద్, సతీశ్, వామనమూర్తి, సత్యనారాయణ, కుమారస్వామి, సంతోష్‌కుమార్, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం నుంచి బ్యాండ్ మేళాతో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ బ్రాహ్మణవాడ, రావులవాడ, పొట్టి శ్రీరాములు చౌక్, అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, క్లబ్ ప్రతినిధులు మర్యాల ఉదయబాబు, బాల శ్రీనివాస్, కలకుంట్ల శ్రీధర్, సభ్యులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో పోలీసుల స్టెప్పులు
కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో..
బ్రాహ్మణవాడలో హోలీ వేడుకలు


